Header Banner

పదోన్నతి వేళ ప్రధాని మోదీతో లోకేష్ భేటీ! లైన్ క్లియర్!

  Fri May 16, 2025 16:30        Politics

ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కానుంది. ఈ సమయంలో పాలనా - పార్టీ పరంగా నిర్ణయాల వేగం పెంచాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీ మహానాడుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే లోకేష్ కు ప్రమోషన్ అంశం తెర మీదకు వచ్చింది. లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దీంతో.. ఈ పరిణామాలు మరింత ఆసక్తిగా మారాయి.

 

ప్రధాని తో భేటీ
ఏపీ మంత్రి నారా లోకేష్ రేపు (శనివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైనట్లు సమాచారం రావటంతో వెంటనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ తనను కలవాల్సిందిగా లోకేష్ కు సూచించారు. తాజాగా ఆపరేషన్ సింధూర్ తరువాత లోకేష్ అపాయింట్మెంట్ కోరారు. కాగా, రేపు ఈ మేరకు లోకేష్ కు అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ పర్యటన సమయంలో ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రజల మూడ్.. ఎన్డీఏ పాలన.. ఏపీలో ఏడాది కూటమి పాలన గురించి చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానికి ఏపీ తరపున అభినందనలు తెలపనున్నారు.

 

ఇది కూడా చదవండి:  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

లోకేష్ కు ప్రమోషన్
లోకేష్ కు పార్టీలో - ప్రభుత్వంలో ప్రమోషన్ గురించి చర్చ జరుగుతోంది. కొద్ది నెలల క్రితం పవన్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు ఓపెన్ గా చేసిన వ్యాఖ్య లు రాజకీయంగా చర్చగా మారాయి. పవన్ అభిమానులు ఈ ప్రతిపాదన పైన ఘాటుగా స్పందిస్తూ పోస్టింగ్స్ పెట్టటంతో వివాదంగా మారింది. ఆ తరువాత ఈ వ్యవహారం పైన ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధినాయకత్వం ఆదేశించటంతో వివాదం ముగిసింది. ఇక, ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో టీడీపీ మహానాడు జరగ నుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ తీర్మానం ప్రతిపాదించగా... ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

 

ఇది కూడా చదవండిఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LokeshMeetsModi #PoliticalPromotion #PMModiMeeting #NaraLokesh #IndianPolitics #TeluguPolitics #BJP